మన టీవీ చానెల్లకు,న్యూస్ పేపర్లకు ఏదో ఓ విషయం దొరికిందంటే ఇక
                  ఆ సుబ్జెక్ట్ మీదే ఊదరగొట్టేస్తుంటారు. కొంతకాలం నిత్యానందమ్ గొడవ. టీవీ ఆన్
                  చేస్తే బెడ్రూమ్ గొడవే!.ఇప్పుడు సానియా, షోయబ్ల పెళ్ళి కబుర్లు! అమ్మయ్య! పెళ్ళయింది
                   అనుకుంటూంటే ఇప్పుడు మెహందీట.తరువాత మరోటి.హనీమూన్ విశేషాలు! దీనికీ
                  రహస్య కమేరాలు వాడి, ఎక్స్లూజివ్ ఫలానా చాలన్ అంటారేమోనని భయమేస్తూంది!
                  క్రికెట్,టెన్నీస్ల పెళ్ళి వార్త విన్నాక నాకో ఐడియా తట్టి పై కార్టూన్ గీయాలనిపించింది.
                  ఇక ఆనాటి ’జ్యోతి’లోని కొన్ని మంచి జోకులను మీకోసం. 
                     * "నేను మీ ఇంటికి భోజనానికొస్తున్నట్లు మీ ఆవిడకు తెలుసా ?"
                        "బలే వాడివోయ్, నిన్ను భోజనానికి పిలిచినందుకు మా ఆవిడకి నాకూ
                        ప్రొద్దున పెద్ద దెబ్బలాటైతేను !"
                                         ++ ++  ++  ++  ++  ++  ++
                       ఒకడు : నా పెళ్ళిరోజున మా అత్తగారు,మామగారు తెగ మురిసి పోయారు. మా ఆవిడ
                   కాపరానికొచ్చిన తరవాతగాని వాళ్ళ సంతోషానికి కారణం గ్రహించలేక పోయాను.
                                        ++ ++ ++ ++ ++ ++ ++ ++ ++
                       "నువ్విదివరకు మన కాలేజీలో పద్మ అనే అమ్మాయిని ప్రేమించేవాడిననే వాడివి కదూ ?
                        ఆ తరవాతేమైంది ?"
                        " ప్రేమించడం మానేశాను."
                        "అదేం ?"
                        " ఆ అమ్మాయినేగా నే పెళ్ళిచేసుకుంది."
                                         ++ ++ ++ ++ ++ ++ ++ ++
                    మద్యప్రదేశ్ రాజధానిలో ఇద్దరు తాగుబోతులు తూలుకుంటూ వస్తున్నారు. రోడ్డు ప్రక్కన
                    వెలుగుతున్న లైటును చూసి అది చంద్రుడని ఒకడు, కాదు సూర్యుడని మరొకడు వాదులాడు
                    కొంటున్నారు. ఇంతలో ఆ దారిలో ఒక పెద్దమనిషి రావడం చూసి "మీరు చెప్పండి సార్,అది
                    చందురుడా,సూరీడా ?" అని అడిగారు.
                    "నాకూ తెలవదయ్యా, నే నీవూరికి కొత్తగా వచ్చాను" అని అతగాడు తూలుకుంటూ వెళ్ళిపోయాడు.
                                          ++  ++  ++  ++  ++  ++  ++
                     కొన్నేళ్ళక్రితం తమిళ చిత్రాలలో "హాస్య జంట"గా పేరుపొందిన ఎన్.ఎస్.క్రిష్ణణ్ ; టి.ఏ. మధురం కలిసి
                     ఒకసారి  ఏదో టీ పార్టీకి వెళ్ళారు. స్వీట్లు,హాట్లూ అయ్యక కాఫీ ఇవ్వబోతుండగా క్రిష్ణన్ "కాఫీ వద్దు,టీ
                     ఇయ్యండి" అన్నాడు.
                     "ఏం కాఫీ తాగరా ?" అన్నాడు ప్రక్కన కూర్చున్న తెలుగాయన.
                     "తాగుతానుగాని, టీ యే మధురం" అన్నాడు క్రిష్ణన్.
                                           ++ ++ ++ ++ ++ ++ ++++
                      రావణుడు,కుంభకర్ణుడు,ఖరుడు,దూషణుడు,విద్యుజ్జిహ్యుడు వాళ్ళ చిన్నతనంలో ఒక సారి
                      విభీషణుడితో దాగుడుమూతలాడుతున్నారు. విభీషణుడికి వాళ్ళకోసం వెతికి,వెతికి విసుగు
                      పుట్టింది. చివరికి " దాగుడుమూతలంటే ఎక్కడన్నా దాక్కోవాలిగాని, ఇలా నిజంగా మాయమై
                      పోతే నేనసలు ఆడను" అన్నాడు.
                                            ++  ++  ++  ++  ++ ++
                       ఇక అలనాటి "జ్యోతి" పత్రికకు ఇంత మంచి జోకులు చెప్పినందుకు ధన్యవాదాలు చెబుతూ ఇక నేనూ
                      ఈనాటికి మాయమై పొతున్నా. ఉంటా టా టా టా టా......................
                                         _ 



 
 
 
 
 
 
 
 
 









"ఇలా నిజంగా మాయమై పోతే నేనసలు ఆడను"
ReplyDeleteఇలాంటి చక్కటి ఊహలు, ఒక్క ముళ్ళపూడి వారికే చెల్లు. మంచి జోకు చెప్పారు.
అప్పారావుగారూ, ఈ మధ్యనే ఏంథోని క్విన్ నటించిన ఒక చక్కటి సినిమా చూశాను "The Secret of Santa Vittoria" అందులో ఒక పెద్దమనిషి దగ్గరకు అతని భార్య వచ్చి, నీ కూతురిని ఆ కుర్రాడు పాడు చేస్తున్నాడు తొందరగా వచ్చి వాణ్ణి చంపెయ్యి లేదా నిన్ను నువ్వు కాల్చుకు చావు రెండిట్లో ఏదైనా నాకు ఒకటే అంటుంది. అప్పుడు ఆ పెద్దమనిషి స్పందన:
I am going to punish that boy, so he will remember the rest of his life
వెనువెంటనే తరువాతి సీన్ తన కూతురు పెళ్ళి అదే కుర్రాడితో ఆనందంగా జరిపుస్తున్న పెద్దమనిషి.
మీరు పైన చెప్పిన ఒక జోకులాగ ఉండి ఇది గుర్తుకు వచ్చింది.
భలే జోకులు....
ReplyDeleteWe enjoyed.
ReplyDeleteఅలనాటి "జ్యోతి" పత్రికనుంచి ఇంత మంచి జోకులు చెప్పినందుకు ధన్యవాదాలు!
ReplyDelete.....ఈనాటికి మాయమై పొతున్నా........" అన్నారు....మళ్లీ ప్రత్యక్ష్యం కాగానే మా కామెంట్స్ చూస్తారనుకుంటా...!
గురువుగారూ,
ReplyDeleteమీరు వేసిన కార్టూన్ మీద వ్యాఖ్యానించే ధైర్యం లేదు.అయినా కానీ, ఒక విషయం చెప్పాలనిపించింది.మీరు టెన్నిస్/ క్రికెట్ గురించి చెప్తూ, మరీ బ్యాడ్మింటన్ నెట్ వేసేశారు. అది టెన్నిస్ నెట్ అయుంటే ఇంకా బాగుండెది. వెయ్యడం రాదూ, వ్యాఖ్యలు మాత్రం చేస్తారూ అనకండి.ఏదో మీదగ్గర ఉండే చనువువల్ల వ్రాశాను.క్షమించేస్తారు కదూ! నాకు తెలుసండి బాబూ !!
అబ్బ కార్టూన్ అద్భుతమండీ....నవ్వలలేక చచ్చాననుకోండీ :)
ReplyDeleteజోకులు భలే బావున్నాయి...మీరు ఇలాగే మాకు ఎప్పటికి ఆనందాన్ని పంచుతారని ఆశిస్తున్నాను. బదులుగా మీకు మేము ఒక మంచి కామెంటు పెట్టేస్తాంలెండి...హిహిహి
ఫణిబాబుగారు, నా కార్టూన్లో నే చేసిన తప్పును చెప్పినందుకు ధన్యవాదాలు.
ReplyDeleteనిజంగా నాకు నవ్వులాటలే తప్ప ఈ ఆటల గురించి అంతగా తెలియదు.
నాకు 'ఈ నెట్' తెలుసు గాని టెన్నిస్ కి 'ఆ నెట్' వాడరని తెలియదు.
ఈ బొమ్మను ఏ మాగజైన్కో పంపకముందే తెలియ జేసినందుకు టాంకులు!
లేక పోతే నేను మాత్రం 'నవ్వుల పాల'య్యే వాడిని.
శ్రీ శివప్రసాద్, సౌమ్య,ధరణీరాయ్ చౌదరి,అక్షర మోహనమ్,ఇనగంటి మీ అందరికీ మీరు
ReplyDeleteఇస్తున్న ప్రోత్సాహామనే 'వీర తాళ్ళ'కి చాలా చాలా ధన్యవాదాలు !