ఫొటోలో చూస్తున్న ఈ పాత రైలు వంతెన 1897 నవంబరు 11 వ తేది నిర్మాణం
         మొదలై 1900 ఆగష్టు 6వ తేదీ నాటికి పూర్తయి రాజమండ్రి నుండి కొవ్వూరు వైపు
         రైళ్ళ రాకపోకలకు అప్పటి మద్రాసు గవర్నరు హేవలాక్ చే ప్రారంభింపబడింది.ఇంతటి
         పెద్ద వంతెనను సాంకేతిక పరిజ్ణానం అంతగా లేని ఆ రోజుల్లోనే కేవలం మూడు సంవత్స
         రాలలోపే నిర్మించడం ఒక విశేషమైతే అనుకొన్నదానికంటే తక్కువ ఖర్ఛు అవటం మరో
         విశేషం.నిర్మాణానికి 50,40,457 రూపాయలు అంచనా వేస్తే ఖర్చయింది 46,89,849
         రూపాయలట!ఈ బ్రిద్జి పై చిట్ట చివరగా కోరమాండల్ ఎక్స్ ప్రెస్ 1997 మార్చి 12న వెళ్ళిన
         తరువాత రాకపోకలను శశ్వతంగా ఆపివేసారు.1964 లో ఆసియాలోనే పెద్దదయిన రోడ్
         కమ్ బ్రిడ్జ్ నిర్మాణం ప్రారంభించి 1974 లొ ప్రారంభించారు.పాత బ్రిడ్జికి సమీపంలో మరో కొత్త
         బ్రిడ్జి ని అర్ధవలయాకారపు డిజైన్ తో నిర్మించారు. ఇక్కడ మూవీలో మీరు లాంచీలో ప్రయాణిస్తూ
         పాత బ్రిడ్జి క్రిందుగా వెళ్ళటం చూస్తారు.రాజమండ్రి పుష్కరాల రేవు నుంచి ఈ కొత్త పాత వంతెనలను
         చూడవచ్చు.



 
 
 
 
 
 
 
 
 









This comment has been removed by a blog administrator.
ReplyDeleteవంతెనలు కట్టిన కొద్దీ గోదావరి అందం తగ్గుతూవచ్చింది।
ReplyDeleteఇంకో నాలుగో వంతెన కూడా కట్టేస్తున్నారు। వీటన్నిటికంటేఁ రెండింతలు పొడవైనది।
ఏమిటో కలి వికృతాలు।